వేసవిలో వేడి వాతావరణం, శరీరంలో నీటి కొరత కారణంగా అజీర్తి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. కొన్ని ఆహారాలతో దీన్ని దూరం చెయ్యొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్వినోవా బరువు తగ్గించి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఆకుకూరలు, దోసకాయ, పుచ్చకాయ, పెరుగు, టొమాటోలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి జీర్ణశక్తిని పెంచుతాయి. ఇతర రుగ్మతలు రాకుండా నివారిస్తాయని సూచిస్తున్నారు.