నేడు ఐపీఎల్లో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలగిన హైదరాబాద్ జట్టు, బెంగళూరు జట్టుతో తలపడనుంది. 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో ఉన్న బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అత్యావశ్యకం. ఓడినా ఆ జట్టు రేసులో ఉంటుంది కానీ.. చెన్నై, లక్నో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు బెంగళూరుకు మెరుగైన అవకాశాలు ఉంటాయి.