ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్లో చివరి ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకునే జట్టు ఏదన్నది నేడు తేలిపోనుంది. నేడు హైదరాబాద్‌తో ముంబై, గుజరాత్ టైటాన్స్‌తో బెంగళూరు తలపడనున్నాయి. ఒకవేళ ముంబై, బెంగళూరు గెలిస్తే చెరో 16 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ఈ రెండు జట్లలో ఒకటి ఓడి.. మరొకటి నెగ్గితే.. ఆ గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ఈ రెండూ ఓడిపోతే.. అప్పుడు ఆర్సీబీ, రాజస్థాన్, ముంబయి తలో 14 పాయింట్లతో ఉంటాయి. ఇలా జరిగితే మళ్లీ నెట్ రన్‌రేట్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.