ప్రపంచకప్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి పసిడి కొల్లగొట్టాడు భారత యువ ఆర్చర్ ప్రథమేశ్ జవాల్కర్. ఆర్చరీ ప్రపంచకప్‌లో తొలిసారి స్వర్ణం ముద్దాడాడు. మరోవైపు అద్భుత ఫామ్‌లో ఉన్న భారత జంట జ్యోతి సురేఖ, ఒజస్ దేవ్‌తలె వరుసగా రెండో ప్రపంచకప్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. టాప్ సీడ్ దక్షిణ కొరియా టీమ్‌ను మట్టికరిపిస్తూ మిక్స్‌డ్ డబుల్స్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. కాంపౌండ్ విభాగంలో రెండు స్వర్ణాలతో భారత్ టోర్నీని ముగించింది.