అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 116 పాయింట్ల లాభంతో 62,079 దగ్గర, నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 18,365 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 పైసలు పుంజుకొని 82.82 దగ్గర ప్రారంభమైంది. బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి.