పగిలిన మడిమలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. కొంతమందికి చలికి పగిలిపోతే.. మరికొంత మందికి ఒంట్లో వేడి కారణంగా పగులుతాయి. ఇలా పగిలిన కాళ్లు కనిపించకుండా కష్టపడాల్సి వస్తుంది. అయితే అరటిపండు గుజ్జుతో వీటికి చెక్ పెట్టవచ్చు. బాగా పండిన అరటి పండ్లని తీసుకుని వాటిని గుజ్జులా చేయాలి. ఇందులో కొద్దిగా తేనె వేసి కలపాలి. ఇలా తయారైన గుజ్జుని కాళ్లకి నిదానంగా మర్దనా చేయాలి. దీంతో చాలా వరకూ సమస్య తగ్గుతుంది.