దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 18 పాయింట్ల స్వల్ప లాభంతో 61,981 వద్ద ముగియగా.. నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 18,333 వద్ద స్థిరపడింది. అదానీ కంపెనీలు, ఐటీసీ, బజాజ్ ఫిన్సెర్వ్, దివిస్ ల్యాబ్, ఇన్ఫోసిస్ కంపెనీలు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. టైటాన్, లార్సెన్, కొటక్ మహీంద్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి.