నేడు ఐపీఎల్ లో భాగంగా చెన్నై వేదికగా గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు గైక్వాడ్ 60(44), కాన్వే 40(34) తొలి వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రహానే 17, రాయుడు 17, జడేజా 22 పర్వాలేదు. షమీ 2, మోహిత్ 2, రషీద్, నూర్, నల్కండే తలా వికెట్ తీశారు.