వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తిన్నా, టీ, కాఫీ తాగినా నాలుక కాలుతుంది. ఒక్కోసారి మంటతో ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సమయంలో నాలుకపై తేనె రాస్తే తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుక కాలితే పెరుగు నాలుకపై రాసుకోవాలి. చల్లని పండ్ల రసం, ఐస్ క్రీం తిన్నా కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే, 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు సమస్య ఉంటే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.