చెన్నై, గుజరాత్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం ధోని తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ చెపాక్ కు వచ్చి ఆడతారా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 'నాకు తెలియదు. నిర్ణయం తీసుకోవడానికి 8-9 నెలల సమయం ఉంది. డిసెంబర్ లో మినీ వేలం కూడా ఉండబోతుంది. ఇప్పుడు ఆ తలనొప్పి తీసుకోవడం ఎందుకు. నేను ఆడినా, బయట కూర్చున్నా ఎల్లప్పుడూ సీఎస్కే తోనే ఉంటాను' అని తెలిపారు.