ఆవిరిపై ఉడికించి తింటే అనేక లాభాలున్నాయి. ఆవిరిపై ఆహారాన్ని ఉడికించి తినడం వల్ల అందులోని పోషక విలువలు చెడిపోవు. ముఖ్యంగా ఆవిరిపై ఉడికించేవాటిలో నూనెను చాలా తక్కువగా ఉపయోగిస్తాం. ఆవిరిపై ఉడికించేవాటిలో కొవ్వులు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అవి తేలికగా జీర్ణమవుతాయి. ఆవిరి పట్టడం వల్ల విటమిన్ బి, థయామిన్, నియాసిన్, విటమిన్ సి వంటి విటమిన్లు మన శరీరానికి శక్తినిస్తాయి.