దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 61,773కి పడిపోయింది. నిఫ్టీ 62 పాయింట్లు కోల్పోయి 18,285కి దిగజారింది. సన్ ఫార్మా, టైటాన్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఘడించాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, HDFC బ్యాంక్, HDFC లిమిటెడ్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాలు చవిచూశాయి.