దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో 62,004 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 18,354 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.72 దగ్గర ప్రారంభమైంది. NTPC, బజాజ్ ఫిన్సర్వ్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, HCL టెక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.