డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 7 నుంచి లార్డ్స్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు బుమ్రా, కేఎల్ రాహుల్, పంత్ వంటి స్టార్లు దూరం కాగా.. తాజాగా ఇషాన్ కిషన్ గాయపడటం కలవరపెడుతోంది. ఐపీఎల్లో గుజరాత్‌తో మ్యాచ్‌లో కిషన్ కంటికి గాయమైంది. దీంతో అతను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.