అంతర్జాతీయ మార్కెట్లలోని జోష్‌తో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 492 పాయింట్ల లాభంతో 62,993 దగ్గర, నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 18,628 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడు పైసలు పుంజుకొని 82.53 దగ్గర ప్రారంభమైంది. సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, HDFC, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.