కెరీర్‌లో చివరి మ్యాచ్‌లో అంబటి రాయుడు అరుదైన ఘనత సాధించాడు. ఆటగాడిగా ఆరో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. దీంతో లీగ్‌లో అత్యధిక ట్రోఫీల్లో భాగమైన ఆటగాడి రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ముంబై తరఫున 2013, 15, 17 సీజన్‌లలో భాగమైన రాయుడు, 2018, 21, 23 సంవత్సరాల్లో CSK తరఫున ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టులో సభ్యుడు. ఇక రోహిత్ విషయానికొస్తే.. 2009 సీజన్ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన హిట్ మ్యాన్.. 2013, 15, 17, 19, 20 సీజన్లలో ముంబై తరఫున ట్రోఫీ అందుకున్నాడు. ఈ జాబితాలో ధోనీ, హార్దిక్ పాండ్యా ఐదు టైటిళ్లు గెలుచుకున్నారు.
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ తన చివరి మ్యాచ్ అని రాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. గుజరాత్ తో కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడిన రాయుడు కీలక సమయంలో బ్యాటింగ్ కు వచ్చి మెరుపు షాట్లతో అలరించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఇకపై మైదానంలో కనిపించకపోవచ్చు. రాయుడు ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడి 4348 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. త్వరలో రాయుడు రాజకీయాల్లోకి రానున్నాడని సమాచారం.