రొమ్ము నొప్పి, రొమ్ము పరిమాణం లేదా ఆకృతిలో మార్పులు, చనుమొన ఉత్సర్గ, చర్మం మార్పులు, వాచిన శోషరస కణుపులు, రొమ్ములో గడ్డలు వంటి ఇతర సంకేతాలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌ను తెలిపేవే. 20 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఆంకాలజిస్ట్ ద్వారా క్లినికల్ టెస్టులు చేయించుకోవాలి. పురుషులను కూడా రొమ్ము క్యాన్సర్ ప్రభావితం చేస్తుంది. వంశపారంపర్య, జన్యుపర లోపాల వల్ల ఈ క్యాన్సర్ రావచ్చు. సెల్ఫ్- అవేర్నెస్, సాధారణ పరీక్షలను చేయించుకోవడం ద్వారా దీని నుంచి జాగ్రత్త పడొచ్చు.