మేషం చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషానిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృషభం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.
మిధునం: బంధువులతో అకారణ తగాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత కలచి వేస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
కర్కాటకం: రావలసిన బాకీలు సకాలంలో వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతషంగా గడుపుతారు.
సింహం: మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరులతో చర్చల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు అదిగమిస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.
కన్య: చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
తుల: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. అనుకున్న పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.
వృశ్చికం: మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
ధనస్సు: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలున్నవి.
మకరం: ఉద్యోగమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
కుంభం: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులు మందాకోడిగా సాగుతాయి.
మీనం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి.