సాధారణంగానే చాలా మందికి రాత్రి పూట నిద్ర లేచే అలవాటు ఉంటుంది. అయితే రాత్రి పూట 1 నుంచి 3 గంటల మధ్య ప్రతిరోజూ నిద్రలేవడం జరుగుతుందంటే అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నవారే ఇలా రోజూ రాత్రి ఆ సమయంలో నిద్ర లేస్తుంటారు. అలాగే మెడిసిన్లను వాడేవారు, షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు మధ్యలో నిద్ర లేస్తారు. అయితే మందులను వాడడం తప్పించి మిగిలిన ఏ కారణం వల్ల అయినా సరే నిద్ర లేస్తుంటే మాత్రం ఆయా సమస్యల నుంచి బయట పడే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. లేదంటే ప్రమాదం.