దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 206 పాయింట్ల లాభంతో 62,635 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 18,553 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.31 దగ్గర ప్రారంభమైంది. ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్షేర్లు లాభాల్లో ఉన్నాయి.