ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ట్విట్టర్ సేఫ్టీ అండ్ ట్రస్ట్ హెడ్ ఎల్లా ఇర్విన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు అసలు కారణాన్ని ఆమె ఇప్పటివరకు తెలపలేదు. అంతేకాకుండా సంస్థకు ఆమె గుడ్‌బై చెప్పడంపై మస్క్ కూడా స్పందించలేదు. ప్రస్తుతం సంస్థ ఉన్న పరిస్థితుల్లో ఇర్విన్ రాజీనామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.