అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సంస్థకు రాజీనామా చేశారు. 2030 నాటికి భారత్‌లో తన క్లౌడ్ వ్యాపారంలో $12.7 బిలియన్లు పెట్టుబడి పెట్టాలని అమెజాన్ ప్లాన్ చేస్తోంది. చందోక్ 2019లో అమెరికన్ టెక్ దిగ్గజం క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్లో చేరారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో అనుభవం ఉన్న ఆయన రాజీనామా సంస్థకు భారీ కుదుపు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.