దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలకో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 314 పాయింట్ల లాభంతో 62,861 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 18, 609 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.52 వద్ద ట్రేడవుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.