మీరు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా? అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నువ్వులను బెల్లంతో కలిపి ముద్దలా చేసుకొని తింటే రక్తహీనత తగ్గుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఐరన్ పుష్కలంగా లభించే తోటకూర, పాలకూర, మెంతికూరలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్-సి ఉండే ఉసిరి, జామ లాంటిలి తినాలి.