దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 176 పాయింట్ల లాభంతో 62,969 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 18,662 వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఫైనాన్స్ మాత్రమే స్వల్ప నష్టాల్లో ఉంది. నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.