రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కాగా, రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వారి సమస్యలపై చర్చించేందుకు మరోసారి ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు. కాగా, రెజ్లర్లు రెండు రోజుల క్రితమే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే.