దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 63,208 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 18,746 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.60 వద్ద ట్రేడవుతోంది. హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, JSW స్టీల్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ఉండగా, కొటక్ మహీంద్రా, అపోలో, ఐషర్ మోటార్స్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.