ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య WTC ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం ఆసీస్ 327/3 పరుగులతో పటిష్టంగా ఉంది. ఇదిలా ఉంటే ఒకవేళ ఫైనల్ డ్రా, టై లేదా రద్దు అయితే ఏమవుతుందో తెలుసుకుందాం. ఐసీసీ రూల్స్ ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా, టై లేదా రద్దయితే టీమిండియా, ఆస్ట్రేలియాలను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. పాయింట్ల టేబుల్, ఇతర నిబంధనలు వర్తించవు. అంతేకాక జూన్ 12న రిజర్వ్ డే కూడా ఉంటుంది.