తోటకూర, అనేక రకాల పోషకాలు కలిగి ఉన్నందున ఆరోగ్యానికి చాలా మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తోటకూర తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెంచడం సహా కళ్లల్లో తేమ లేకపోవడం, దృష్టి లోప సమస్యలను నివారిస్తుందని పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఇందులోని సి విటమిన్ చర్మ సబంధింత సమస్యలు దూరం చేస్తుందని చెబుతున్నారు. అలాగే, కీళ్లు, మోకాళ్లు, కండరాల నొప్పులతో బాధ పడేవారు తోటకూర తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.