ఎడ్యూటెక్ సంస్థ బైజూస్ మరోసారి తమ ఉద్యోగులకు షాకిచ్చింది. గత అక్టోబర్ నుండి దాదాపు 2,500 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్, తాజాగా మరో వెయ్యి మందిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు మార్కెటింగ్, సేల్స్ విభాల నుండి తొలగింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, దిగ్గజ సంస్థలైన మెటా, అమెజాన్ సైతం వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.