ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఫైనల్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ ఇరు జట్లకు భారీ జరిమానా విధించింది. భారత్ కు 100 శాతం, ఆస్ట్రేలియాకు 80 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించింది. టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు 115 శాతం జరిమానా విధించింది. గిల్ ఔట్ పై వివాదం చెలరేగగా, అతడు కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించాడని ఐసీసీ పేర్కొంది.