నేటి (మంగళవారం) నుంచి ఇండోనేషియా ఓపెన్-2023 టోర్నీ ప్రారంభం కానుంది. స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ ఈ పోటీలో తలపడేందుకు సిద్ధమయ్యారు. పురుషుల సింగిల్స్ లో తొలి రౌండ్లో నిషిమోటో (జపాన్)తో ప్రణయ్ తలపడనున్నాడు. అలాగే తెలుగు షటర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నమెంట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, మహిళల డబుల్స్ లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడిగా పోటీలో పాల్గొననున్నారు.