దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. వరుసగా రెండు రోజులు లాభాలను ఆర్జించిన తర్వాత మూడో రోజు సూచీలు తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 16 పాయింట్లు తగ్గి 63,126 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 6 పాయింట్లు మెరుగుపడి 18,721 పాయింట్ల వద్ద ఉంది. JSW స్టీల్, హిండాల్కో, టాటా స్టీల్, ONGC షేర్లు లాభాల్లో ఉండగా.. SBI ఇన్సూరెన్స్, ఎయిర్టెల్, HUL, సిప్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.