డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించిన టీమిండియా స్టార్ అజింక్యా రహానె టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి చోటు దక్కించుకున్నాడు. బుధవారం విడుదలైన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల విభాగంలో రహానె 37వ స్థానంలో నిలువగా శార్దూల్ ఠాకూర్ ఆరు ర్యాంకులు మెరుగై 97వ స్థానంలో నిలిచాడు. కానీ ఆసీస్‌కు చెందిన లబుషేన్, స్మిత్, హెడ్ బ్యాటర్లలో మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకొని అరుదైన ఘనత సాధించారు. 1984లో విండీస్ కు చెందిన గ్రీనిడ్జ్, లాయిడ్, గోమ్స్ ఇలా బ్యాటర్లలో తొలి మూడు ర్యాంకుల్లో నిలిచారు.