ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు సహా పలు సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. తాజాగా క్యాబ్ సేవల సంస్థ ఉబర్ కూడా లేఆఫ్స్ ప్రకటించింది. రిక్రూట్ మెంట్ విభాగంలో 200 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో రవాణా సేవల విభాగం నుంచి 150 మందిని తొలగించగా.. తాజాగా రిక్రూట్ మెంట్ విభాగంలో 35 శాతం లేఆఫ్స్ ప్రకటించింది. ఉబర్ లో ప్రపంచ వ్యాప్తంగా 32,700 మంది ఉద్యోగులు ఉన్నారు.