క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ ‘పిల్లో’ తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 31 నుంచి సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోనున్నట్లు పేర్కొంది. కఠిన వ్యాపార పరిస్థితుల కారణంగా సంస్థను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. యూజర్ల నిధులపై వడ్డీ రాబడి ఇకపై ఉండదని, రివార్డుల విభాగాన్ని యాక్సెస్ చేసుకోలేరని తెలిపింది. ఈ నెల 31 వరకు క్రిప్టో విత్‌డ్రాలు, జూలై 7వ తేదీ వరకు బ్యాంక్ విత్‌డ్రాలు అందుబాటులో ఉంటాయన్నారు.