భారత మహిళా క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వామికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీలో సభ్యురాలిగా ఆమె ఎంపికైంది. గోస్వామితోపాటు ఇంగ్లండ్ ప్లేయర్లు ఇయాన్ మోర్గాన్, హీతర్ నైట్లకు కూడా చోటు దక్కింది. ఈ ముగ్గురు దిగ్గజాలను స్వాగతిస్తూ ఎంసీసీ వరల్డ్ కమిటీ హెడ్ మైక్ గాటింగ్ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ క్రికెట్కు జులన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ తరఫున 204 వన్డే మ్యాచులు ఆడి 255 వికెట్లు, 12 టెస్టుల్లో 44 వికెట్లు తీసిన ఘనత గోస్వామికే దక్కుతుంది.