దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (సాఫ్)లో ఆతిథ్య భారత ఫుట్‌బాల్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన పోరులో భారత్ 4-2 స్కోరు తేడాతో లెబనాన్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ ఖాతా తెరువకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. భారత ఆటగాళ్లు సునీల్ ఛెత్రీ, మహేశ్ సింగ్, అన్వర్ అలీ, ఉదాంత సింగ్ పెనాల్టీ గోల్స్ వేయడంతో ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్లో కువైట్‌తో భారత్ తలపడనుంది.