బ్రెజిల్ ఫుట్బాల్ స్టార్ నేమార్కు కోర్టు భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రియో డీజెనీరో శివారులోని తన ఇంటి నివాసం వద్ద సరస్సు నిర్మించినందుకు గాను కోర్టు 3.3 మిలియన్ డాలర్ల (రూ.27 కోట్లు) ఫైన్ విధించింది. నేమార్ తన భవనం వద్ద కృత్రిమ సరస్సు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు టౌన్ కౌన్సిల్ జరిమానా విధించినట్లు కౌన్సిల్ సెక్రటేరియట్ తెలిపింది.
జూన్ 22న సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా నేమార్ ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. విలాసవంతమైన ఆయన భవనం వద్ద నిర్మిస్తున్న కృత్రిమ సరస్సు, బీచ్లో అనేక పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం సైట్ను స్వాధీనం చేసుకుని కార్యకలాపాలు నిలిపివేయించారు. కోర్టు విధించిన జరిమానాపై నేమార్ కానీ, ఆయన కార్యాలయం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.