వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ రూల్స్‌ను సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 85 శాతం సీట్లు మాత్రమే స్థానిక విద్యార్థులకు కేటాయించేవారు. మిగిలిన 15 శాతం సీట్లను అన్ రిజర్వ్‌డ్‌గా ఉండేవి. ప్రభుత్వ, ప్రైవేట్‌తో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. తాజా సవరణ వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి.