న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐసీసీ టెస్ట్ క్రికెట్లో నం.1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ క్రమంలో 883 పాయింట్లతో కేన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ 882 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా ప్లేయర్లు రిషబ్ పంత్ 10, రోహిత్ శర్మ 12, విరాట్ కోహ్లీ 14వ స్థానంలో కొనసాగుతున్నారు.