1) మేషరాశి.. వారం ప్రారంభంలో ఆర్థిక,వాగ్దానాల విషయాల్లో,ముఖ్యముగా భూ సంబంధ ఆదాయం రావడంలో ఆలస్యాలు.ప్రయాణాల్లో,ముఖ్యమైన నిర్ణయ విషయాలలో కొంతమేర ఆకస్మిక వాయిదాలు. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం , సమయానికి ఆహార స్వీకరణ విశ్రాంతి ముఖ్యం.సోదర వర్గము వారినుండి ముఖ్యవిషయాల్లో,సమావేశాల్లో కమ్యూనికేషన్ సమస్య లేకుండా జాగ్రత్తగా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు .విదేశాల్లో ఉన్న తోబుట్టువుల, మరియు సంతానము సహకారము అందుతుంది . పెద్దల గురువుల ఆశీస్సులు అందుకుంటారు, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన. విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధి. వారం మధ్యలో మీలో వృత్తికి సంబంధించిన అభివృద్ధి అంశాలలో కొత్త ఆలోచన.ఆత్మవిశ్వాసం,అధికారము పెఱిగి ఉత్చాహముగా ఉంటారు. తల్లి గారికి ఆదాయము అందుతుంది. మిత్రులకి విద్యా ఉద్యోగాల్లో మీ సహకారముతో నూతన అవకాశములు. సాఫ్ట్వేర్ రంగాల్లో వారికి విదేశీ వీసా ప్రయత్నాలు, ఫార్మ, మెడిసిన్ రంగాల్లో వారికి విదేశాల్లో రాణింపు. వారం చివరిలో దైవ సంబంధ ఉపాసన పెరుగుతుంది. ఆత్మీయులతో చర్చలు. ఒక ఆహ్వానాన్ని అందుకుంటారు సంతోషకరమైన వాతావరణం. సంతానం అభివృద్ధి. దత్తమందిరాలు దర్శనము, దత్త చరిత్ర పారాయణము మంచిది
2) వృషభరాశి.. వారం ప్రారంభంలో శరీరశ్రద్ధ పెరుగుతుంది , మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి రీత్యా ప్రయాణాలకి, సోదర సమానులైన ఆత్మీయుల నుండి ఆహ్వానములు, కళా రంగంలో ఉండే వారికి సత్కారాలు. వారం మధ్యలో చేస్తున్నవృత్తిలో అధికారులతో, ఆత్మీయులైన మిత్రులతో జాగర్తగా మాట రాకుండా చూసుకువాలి. కమ్యూనికేషన్ లో అపార్ధాలు, చికాకులు, ఆర్థికపరమైన ఆటంకములు కొంత చికాకు కలిగిస్తాయి. గృహ, వాహన విషయాలలో చిన్న చిన్న విషయాలు మీకు ఇబ్బంది బాధ కలిగిస్తాయి. సర్దుకుపోవడమే మంచిది. వృత్తిపరమైన ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది అయినప్పటికి మీరు దేర్యముగా ముందుకు వెడతారు. ఆశించిన వ్యక్తుల సహకారము ఆనందాన్ని ఇస్తుంది. మనసుకి ప్రశాంతత తగ్గినప్పటికి కమ్యూనికేషన్ సమయములో జాగర్త అవసరము. నూతన మొబైల్ ఎలక్ట్రానిక్ పరికరములు కొనే యోచన. అనుకుని బహుమానములు ఆనందాన్నిస్తాయి. వారం చివరిలో నూతన అంశములు తెలుసుకుంటారు.తల్లి, కుటుంబములో ముఖ్య స్త్రీల సహకారము బాగుంటుంది. ఇంటిని అందముగా తీర్చిదిద్దుపైనే ప్రయత్నాల్లో తలమునకలవుతారు. కొత్త ఆకర్షనీయమైన విలాసవస్తువులపై కొనుగోలు ప్రయత్నాలు. కుటుంబములో వాయిదాపడ్డ పనులు ముందుకు వెడతాయి.హనుమాన్ చాలీసా, హనుమాన్ దేవాలయములు సందర్శన మేలు
3) మిథునరాశి.. వారం ప్రారంభంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, శత్రువులపై విజయం సాధన ,రుణములు చెల్లింపు అనే అంశములు పై దృష్టి సారిస్తారు. వ్యాపారభాగస్వాములతో వీలైనంత ఆలోచించి మంతనములు సాగించటం మేలు. భాగస్వాములు మధ్య మనస్పర్థలేమన్న ఉన్నా చిన్నపాటివి తొలగి తాత్కాలిక ఎడబాటునుండి కలుస్తారు. నాయకత్వ లక్షణాలు పెంచుకుంటూ సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకుంటూ వ్యక్తుల మనసును గెలుస్తారు. పౌరుషం పెరుగుతుంది నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయరంగంలో ఉండే వారికి అనుకూలం. వారం మధ్యలో వైరాగ్య ఆలోచనలు అసంతృప్తిగా పనులు, ఆర్థిక చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. మనసు ప్రశాంతత తగ్గి ఆధ్యాత్మిక చింతనకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వృత్తిపరమైన ఆదాయము అందిన పోటికి మంచి ప్లానింగ్ అవసరము ఖర్చుచ్చేసే విధానములో. వారం చివరిలో తండ్రి ఆరోగ్యముపై శ్రద్ధ వహిస్తారు. విద్యార్ధులకి ఉన్నత విద్యా, ఆ పరమైన ప్రయణ ప్రయత్నల వలన ఆటంకములు ఎదురైనాప్పటికి నీరసపడకుండా కృషి గట్టిగా చేస్తారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. వెంకటేశ్వర శతనామావలి, వెంకటేశ్వర మందిరం దర్శనాలు మేలు
4) కర్కాటకరాశి.... వారం ప్రారంభంలో సంతానముతో అభిప్రాయ భేదములు రాకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మనసు ప్రశాంతత కొంత తగ్గినప్పటికీ, ఆధ్యాత్మిక ఆలోచనలతో దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఒక ముఖ్యమైన వార్త అందుకుంటారు. ఆత్మీయ మిత్రులు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు.వారం మధ్యలో గృహ సంబంధవాహనకొనుగోలులో ఎదో విధమైన ఆటంకములు మనసు కొంత తెలీని బాధ.మీ భాగస్వామిసమయస్పాయిర్తి సలహాలువలన మీరు ఇబ్బందులను కొంతవరకు అధిగమిస్తారు .వారము చివరిలో గృహములో వృత్తి ప్రదేశములో కూడ అలజడి . వీలైనంతవరకు తక్కువ ప్రతిస్పందించటం. వాగ్వాదములకి దూరముందుట మంచిది. మీపైఅధికారులతో ఆకస్మికచికాకులుమీకువత్తిడికలిగిస్తాయి.ఆరోగ్యాపరముగా ఇబ్బందులు.సేవకులు మీ క్రింద పనివారిసహకారముఆశించినస్థాయిలోలేకపోవటంవలన మీరు నిరాశ అసంతృప్తికి లోనియ్యే పరిస్థితి. అన్నిటినీ అధిగమించడానికి సాయిబాబా చరిత్ర పారాయణ, సాయిబాబా దర్శనము మేలు
5) సింహరాశి.. వారం ప్రారంభంలో నూతన అంశాలు తెలుసుకుంటారు, విదేశాల్లో ఉన్న తల్లి తరుపు బంధువులతో సహకారము కోరుకుంటారు. ఆధ్యాత్మిక వ్యక్తులు ప్రసంగాలు మనసుకి
సంతోషాన్నిస్తాయి.మనసు ఘర్షనాత్మకముగా ఆలోచనలు ఆస్తిరముగా ఉంటాయి. కుటుంబములో బంధువుల రాక, ఆకస్మిక ఖర్చులు పెరిగినప్పటికి సంతోష్కరమైన వాతావరణము. నచ్చిన వస్తువు కొనుగోలుకై అధికవ్యయములు.ఆరోగ్యముబాగుంటుంది. వారంతములో సమయానికి ఆశించిన పనులు మీ క్రింద సిబ్బంది, సేవకులు మొదలైన వ్యక్తుల సహకారముతో ముందుకు సాగుతాయి, మీకు గుర్తింపు గౌరవము వారి వలన లభిస్తుంది.ఆ రీత్యా వారు తగిన ప్రతిపలములు ఆశిస్తారు. ఆ విషయములో మీరు చేసే ప్రత్యుపకారమునకు దీర్ఘకాలిక సంబంధబంధవ్యములు వృత్తిలో ,మీరు వారి సేవల్లో మరల మరల పొందగలరు. సంతాన విషయములో అధిక జాగర్త తీసుకుంటారు, వారి స్నేహాలు మరియు వారికి అలవాట్లు లోనుకాకుండా శ్రద్ధ చూపిస్తారు .ఆడంబరములకి వృధా ఖర్చులు. ఆరోగ్యము పై ప్రత్యేక శ్రద్ధతో ఖర్చులు.శరవాణభవస్మరణ, సుబ్రహ్మణ్య మందిరములు దర్శనార్ధము మేలు.
:
6) కన్యరాశి... వారం ప్రారంభంలో మనసు ప్రశాంతంగా తక్కువగా ఉంటుంది వ్యక్తుల సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ మొత్తం మీద స్వయం నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లిపోతారు. విద్యార్థులు విదేశీ విద్య కొరకు గట్టిగా కృషి చేస్తారు. దూర ప్రయాణాలు అవకాశము. గృహ నిర్మాణ అంశములపై ప్రయత్నాలు పెంచుతారు. వాహనములు నడిపేటప్పుడు తగిన జాగర్త మేలు. గృహ వాహన సంబంధ ఖర్చులు చేసేటపుడు కొత్త వ్యక్తులతో మోస పోకుండా ఆలోచించాలి.మాట్లాడేటపుడు మాటలు అపార్ధముకాకుండా అలోచించి మాట్లాడుట మేలు. మంచి వ్యక్తుల సహకారము లభిస్తుంది. పెట్టుబడులు పెట్టేటపుడు జాగర్తగా వ్యవహారించాలి.స్త్రీ సంతానమునకు లలితకళల కి సంబంధించి వృత్తికి అవకాశములు. బిజినెస్ మానేజ్మెంట్, హోమియోపతి విద్యలలో విద్యార్ధులకిఅవకాశము.పోటీలలోనెగ్గటము.ఆరోగ్యములో ఇమ్మ్యూనిటి లో శ్రద్ధ. ఉద్యోగులకి వృత్తిలో కొత్త బాధ్యతలు, కొత్త వ్యక్తుల పరిచయాలు. శ్రమ. ఆశించిన ప్రయోజనాలు, లక్ష్యసాధన. మనసులో కోరికలు తీరుతాయి. ఆత్మవిశ్వాసముతో తొందరపాటుగా చేసే ఖర్చులు నియంత్రణ మంచిద.దుర్గాదేవి దేవాలయములు, దేవిఖడ్గమాల శ్రవణము మేలు
7) తులరాశి.. వారం ప్రారంభంలో మాటల వల్ల వృత్తి పరంగా, మరియు కుటుంబ సభ్యులతో అపార్థములు రాకుండా జాగ్రత్త పడాలి.ముఖ్య పనుల్లో ఆలస్యము, బద్ధకించకుండా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయటం కొంత మంచిది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా జాగర్త తీసుకోవాలి, అపరిచితులవలన ఆకస్మిక మోసానికి,లేదా ఖర్చులకి అవకాశములు. వ్యాయమ ప్రాణాయామములు, మెడిటేషన్ పై శ్రద్ధ ముఖ్యము. వారం మధ్యలో కుటుంబ ఆదాయము, వాతావరణము బాగుంటాయి. క్రీడాల్లో ఉత్య హముగా పాల్గుంటారు. గుర్తింపు గౌరవము కి అధిక శ్రమ. తోబుట్టువులు సహకరిస్తారు.మిత్రుని సహాయముతో వృత్తిలో దూరప్ర దేశాల్లో అవకాశములు. తండ్రిగారి ఆరోగ్యం బాగుంటుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. మొబైల్ వంటి కొత్త వస్తువులు కొనే ప్రయత్నాలు. నూతన అంశములపై శ్రద్ధ విద్యాపరముగా కంప్యూటర్, గణిత రంగాల్లో వారికి రాణింపు. సంతానమునకు వారి రంగాల్లో గుర్తింపు తో కూడిన గౌరవము. ఆకస్మికముగా అందమైన వస్తువులకు అధిక ఖర్చు.ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నత వ్యక్తుల ఆశీస్సులకై ప్రయత్నాలు ఫలిస్తాయి. బాలాజీ మందిరాలు, శ్రీరామజయరామ జయజయరామరామ శ్లోక పారాయణం
8) వృశ్చికరాశి.. ప్రారంభంలోమీ ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. అశ్రద్ధచేయకుండా వైద్యులని కలవటం అవసరమైతే మంచిది. ముఖ్య విషయాల నిర్ణయములో పెద్దల సహకారముకై ప్రయత్నాలు. మనసు కొత్త ప్రణాళికలతో ఉంటుంది. దూర ప్రదేశాలలో ఉండే బంధువులతో పలకరింపులు. ఆధ్యాత్మిక ప్రదేశములు చూడడానికి ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశములలో ఉన్న తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల రిత్యా చర్చలు, పిత్రార్జిత భూమి మరియు గృహ అంశాలలో ముఖ్య బంధువర్గముతో ఘర్షణ లేకుండా చూసుకోవాలి. విద్యార్థులకు విద్య మీద శ్రద్ధ తీసుకోవాలి , దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేయు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ప్రయాణములు ఇబ్బంది. వృత్తిలో చిన్నపాటి విబేధములు. దైనందన జీవనములో మార్పులు. ఆశించిన ఫలితల్లో అసంతృప్తి. పుణ్యబలంని పెంచుకోవాలి. వారం చివరిలో మీరు పడిన కష్టానికి కొంత ప్రతిఫలం లభిస్తుంది చాలాకాలంగా ఇబ్బంది పడుతున్న భూ సంబంధ అంశాల విషయాలు కొంచెం ముందు కదులుతాయి.వ్యాపారరంగములో వారికి ఆకస్మిక ఆటంకాలు ఏర్పడకుండా ,చేసే పనుల్లో దైవచింతన అవసరము. లా, మానసికశాస్త్రము, హోటల్ మానేజ్మెంట్ చదివే విద్యార్ధులకి గుర్తింపు, గౌరి శత నామములు, శివాలయదర్శనములు మేలు
9) ధనుస్సురాశి.. ప్రారంభంలోదూరప్రాంతాల్లో ఆధ్యాత్మిక వ్యక్తులను ఆశీస్సులకై కలుస్తారు. పుణ్యక్షేస్త్రాలు సందర్శిస్తారు. చారిటబుల్ ట్రస్ట్ లకి మొదలైన వాటికి విరాళాలు అందిస్తారు. వ్యాపారములో స్నేహితుల సహకారముతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.భాగస్వామి కొరకు బహుమానములు కై ఖర్చులు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో నూతన ఆలోచనలకు శ్రీకారం చుడతా రు. వాహన మార్పుకై ఆలోచనలు, గృహము గృహాపకరణములు మార్పుకై ప్రయత్నాలు సఫలము. ఆరోగ్యముపై శ్రద్ధ వహించాలి. వారము మధ్యలో వ్యక్తులతో అభిప్రాయాబేధములు లేకుండా జాగర్తలు అవసరము. ముఖ్య పనుల్లో ఆటంకాలు, అనుకోని ఇక్కట్లు ఎదురయ్యే సూచన దృష్ట్యా వీలైనంత ముందు జాగర్తలు మంచిది. ముఖ్యమిత్రులను కలుస్తారు. అధికారములో నున్న వ్యక్తుల సహకారము పొందుతారు. ముఖ్యముగా రాజకీయముగా పలుకుబడి ఉన్నా బంధువులు తో మీ కమ్యూనికేషన్ బాగుంటుంది. విద్యార్థులు సంతృప్తిగా విద్యలో అభివృద్ధి.సూర్య అష్ట్తోత్తర, ఆదిత్యహృదయ పారాయణ మంచిది
10) మకరరాశి.. వారం ప్రారంభంలో భాగస్వామికి ఆదాయపరంగా అభివృద్ధి, నూతన అవకాశాలు. వృత్తి పరంగా భాగస్వాములతో ఉన్న అభిప్రాయ భేదాలు కొంతవరకు తగ్గిపోతాయి.సంతానముకి అభివృద్ధి. ఇంజనీరింగ్ మెడికల్విద్యార్ధులకి అనుకూలం. గృహా సంబంధ రెంట్ వసులు అవుతాయి. ఆగిన టాక్సులు చెల్లిస్తారు.దగ్గర ప్రయాణాలు, రిసార్ట్స్ వంటివి బంధు మిత్రులతో కలిసి సందర్శన కి అవకాశములు. సమయస్ఫూర్తి తో వ్యవహారాలు నడుస్తాయి.చాకచక్యము,చలాకిగా మాట్లాడుతూ అన్ని విశ్లేషస్తూ నిర్ణయాలు తీసుకుంటారు.కంటి విషయములో శ్రద్ధ అవసరము మధ్యలో పనులు వాయిదా, ఆరోగ్యము మరియు ప్రయాణాల్లో జాగర్తలు తీసుకువాలి. ఆకస్మిక ఖర్చులు చికాకు. రావాల్సిన ధన ఆదాయము లో ఆటంకాలు, రుణాలుచెల్లించేప్రయత్నాలు. వారము చివరిలో కుటుంబములో స్త్రీలతో, ముఖ్యముగా పెద్దవారితో మాటపట్టింపులు లేకుండా జాగర్తమంచిది. విష్ణు సహస్రణామములు పారాయణ, శ్రవణము మంచిది
11) కుంభరాశి... వారం ప్రారంభంలో వృత్తిపరంగా అధికారము పెరుగుతుంది. దర్పముగా ఉంటారు. రాజకీయ నాయకుల సహకారము లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పలుకుబడి కొంతమేర పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం తో నూతన ప్రయత్నాలు. విదేశీ అవకాశములు.విదేశ విద్యకై స్త్రీ సంతానముకి కొత్త అవకాశములు. సంతానముకై ముఖ్యమైన స్కూల్ సంబంధ స్టేషనరీ కొనుగోలు.ధైర్యముగా నిర్ణయాలు నాయకత్వ లక్షణాలు. తండ్రి తో సంబంధ బంధవ్యలు. దూరప్రదేశాల్లో ఉన్న మిత్రులు సహకారము ధన విషయములో. ఉపాధికయి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వారము చివరిలో ఆరోగ్యవిషయములో తగిన జాగర్త , ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆటంకాలు, ఆకస్మిక చికాకులు వాయిదాలు, పనుల్లో ఆలస్యము మీ సహనానికి పరీక్షలా ఉన్నప్పటికీ ఓర్పుతో అన్ని అధిగమిస్తారు.శ్వసక్తితో విజయసాధనకై లక్షన్ని ఏర్పరచుకొని ఆ మార్గములు విజయాన్ని సాధించే ప్రయత్నాల్లో పట్టుదలగా ముందుకు సాగుతారు. మీ ఆత్మ విశ్వాసమే మీకు శ్రీరామ రక్ష. మంచి ఫలితాల కొరకు లలితసహస్రనామ స్తోత్రలు మంచిది.
12) మీనరాశి... ప్రారంభంలో ఉపాసన బలం బాగుంటుంది గురు సమానులను కలుస్తారు. వ్యక్తుల సహకారాన్ని పొందుతారు. సంఘ సేవ చేస్తారు . మీ లక్ష్య సాధన ,వృత్తి నిర్వహణలో అసమాన ప్రతిభ చుపిస్తూ మీకు మీరే సమానము అనిపించుకుంటారు. విదేశాల్లో ఉన్న ఆధ్యాత్మిక వ్యక్తుల సహకారము, గురువులు పెద్దల ఆశీస్సులతో అనుకున్నపనులు ముందే పూర్తి చేసి విజయ బావుటా ఎగురవేస్తారు. కొలీగ్స్, మిత్రుల సహకారము తో మీరు ఆశించిన లక్ష్యాన్ని సులభముగా సాధిస్తారు. నూతన వృత్తులలో అవకాశములు వస్తాయి. విద్యార్ధులకి సమయము చాలా అనుకూలము. అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళిపోతారు. ఋణములు చెల్లిస్తారు.ఆత్మవిశ్వాసముతో కృషిశీలతతో శత్రువులపై విజయాన్ని అతిసునయశముగా సాధిస్తారు. వారాంతంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆలోచనలు చేస్తారు సుబ్రహ్మానయేశ్వర దేవాలయములు సందర్శన, మేలు