గురువారం స్థిరంగా కొనసాగిన బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరిగిపోయింది. దేశంలో శుక్రవారం 22 క్యారెట్స్ బంగారం ధర రూ.100 పెరిగి రూ.54,250కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,160 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా 22 క్యారెట్స్ ధర రూ.54,250, 24 క్యారెట్స్ ధర రూ.59,160గా ఉంది. కాగా ఢిల్లీలో కిలో వెండి రూ.73,000 ఉండగా. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.76,700 వద్ద కొనసాగుతోంది.