దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 238 పాయింట్ల లాభంతో 65,518 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 19,399 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.60 వద్ద కొనసాగుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, HDFC లైఫ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.