భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది. డోపింగ్ నిరోధక నిబంధనలు పాటించడంలో వినేష్ పూర్తిగా విఫలమయ్యారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు రెండు వారాలపాటు వినేష్ ఫొగాట్‌కు గడువు ఇచ్చింది. గత నెల హరియాణాలోని సోనిపట్‌లో డోపింగ్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉండగా.. ఫొగట్ రాలేదు. దాంతో అధికారులు నోటీసులు జారీ చేశారు.