భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అతను ఏకంగా 12 వికెట్లు తీశాడు. ఆ టెస్టు మ్యాచ్‌లో 141 పరుగుల తేడాతో ఇండియా నెగ్గింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు. పేస్ బౌలర్లకు అనుకూలించే విండీస్ పిచ్‌లపై స్పిన్ బౌలర్ అశ్విన్ సత్తా చాటాడు. టెస్టుల్లో అశ్విన్ మొత్తం 8 సార్లు 10 వికెట్లు తీశాడు.