రోజూ అరగంట సేపు నడవడం వల్ల అనేక వ్యాధులు మన దరిచేరవు. అధిక బీపీ ఉన్నా, మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినా కచ్చితంగా రోజూ క్రమం తప్పకుండా నడవడం అలవాటు చేసుకోండి. అలా నడవడం వల్ల మీ బీపీ, చెడు కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. నడక మధుమేహానికి ఔషధంలా పనిచేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు రోజూ నడిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.