స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఒక్కరోజు, నెల, ఆరు నెలలు, ఏడాది, రెండేళ్ల MCLR శాతాలు పెరిగాయి. MCLRతో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు పెరిగనుండడంతో లోన్ తీసుకున్న కస్టమర్లు చెల్లించే ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. ఈ పెంపు నేటి నుండి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa