భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ఓటమి పాలైంది. తాజాగా యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. చైనాకు చెందిన జావో ఫెంగ్ జియె చేతిలో గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడోసారి ఓడిన సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 20-22, 13-21తో ఫెంగ్ చేతిలో వరుస గేమ్స్‌లో పరాజయం పాలైంది.