మానవ శరీరానికి నీరు ఎంతో అవసరం. అయితే బ్రెష్ చేసుకోకుండా నీరు తాగొచ్చా? లేదా? అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఉదయాన్నే బ్రెష్ చేసుకోకుండా నీరు తాగితే ఎలాంటి నష్టం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా నీరు తాగడం వల్ల విష వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయని పేర్కొన్నారు. రాత్రి తిన్న ఆహారం అరగకుండా ఉంటే ఉదయాన్నే నీరు తాగడం వల్ల జీర్ణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత కచ్చితంగా నీరు తాగాలని సూచిస్తున్నారు.